- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన కళ్లు అంటే నాకు ఇష్టం.. టాలీవుడ్ స్టార్ హీరోపై అవికాగోర్ ప్రశంసలు
టాలీవుడ్‌కు చెందిన ఆ హీరో కళ్లు, ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం అంటుంది హీరోయిన్ అవికాగోర్.

దిశ, సినిమా: టాలీవుడ్‌కు చెందిన ఆ హీరో కళ్లు, ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం అంటుంది హీరోయిన్ అవికాగోర్. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తన పెళ్లి తర్వాత ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అవిక.. రీసెంట్‌గా ‘అగ్లీస్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘మీ జీవితకాలంలో ఒకే హీరోతో కేవలం మూడు సినిమాలు చేసే అవకాశం వస్తే, మీరు ఎవరిని ఎంచుకుంటారు?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ఆలోచించుకోకుండా నేచురల్ స్టార్ నాని పేరు చెప్పింది ఈ బ్యూటీ. ‘ఆయన కళ్ళు, ఆయన భావాలను వ్యక్తపరిచే విధానం, ప్రతీదానిలో ఎంతో డెప్త్ ఉంటుంది. ఆయన నటనలో ఎన్నో కోణాలు ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు అలాంటి నటన అంటే చాలా ఇష్టం. ఆ హీరోతో సినిమా చేయడానికి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను’ అని తెలిపింది.
- Tags
- Avika Gor






