90's ప్రేక్షకులకు భారీ గుడ్ న్యూస్.. దేవి సీక్వెల్‌‌పై కీలక అప్‌డేట్

by Chukka Sudharani |   (  Updated:2026-04-28 15:48:05  IST  )

90'sలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విజువల్ వండర్‌గా నిలిచిన చిత్రం ‘దేవి’. నిర్మాత ఎంఎస్ రాజు దేవి సీక్వెల్‌ను భారీ స్థాయిలో రూపొందించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

90s ప్రేక్షకులకు భారీ గుడ్ న్యూస్..  దేవి సీక్వెల్‌‌పై కీలక అప్‌డేట్
X

దిశ, సినిమా: 90'sలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విజువల్ వండర్‌గా నిలిచిన చిత్రం ‘దేవి’. 1999లో విడుదలైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు.. హారర్, ఫాంటసీ, భక్తి అంశాల మేళవింపుతో ఎప్పటికీ గుర్తుండిపోయే మార్క్‌ను సెట్ చేసుకుంది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతలను ఎంఎస్ రాజు తీసుకున్నారు. ఇప్పుడు నిర్మాత ఎంఎస్ రాజు మరోసారి తన క్లాసిక్ హిట్‌ను కొత్త రూపంలో ఆడియన్స్ ముందుకు తెసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా దేవి సీక్వెల్‌ను భారీ స్థాయిలో రూపొందించే ఆలోచనలో ఉన్నారని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయని సమాచారం. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. 90's ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. దేవి సినిమాలో ప్రేమ, వనిత విజయకుమార్, షిజు, అబ్బాస్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, ఎల్.బి శ్రీరామ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Read More.. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత.. పవన్ కళ్యాణ్ బాటలో శృతి హాసన్

Next Story