వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత.. పవన్ కళ్యాణ్ బాటలో శృతి హాసన్

by Chukka Sudharani |   (  Updated:2026-04-28 15:17:56  IST  )

మల్టీ టాలెంటెడ్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేస్తుంది.

వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత.. పవన్ కళ్యాణ్ బాటలో శృతి హాసన్
X

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేస్తుంది. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ‘పెద్ది’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్.. తన వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభువాన్ని పంచుకుంది. ‘ఇటీవల నా జీవితంలో, నేను వారాహి అమ్మవారి ఉనికిని అనుభూతి చెందాను. కొన్నిసార్లు మనం మాత్రమే దేవుడిని ఎంచుకోము.. దేవుడు కూడా మనల్ని ఎంచుకుంటాడని నేను నమ్ముతాను. ఒకసారి నా స్నేహితురాలు నేను కాస్త భిన్నంగా కనిపిస్తున్నానని చెప్పి నన్ను ఒక గుడికి తీసుకెళ్లింది. అది ఒక చిన్న గుడి, కానీ నేను లోపలికి అడుగుపెట్టిన క్షణంలోనే, నాకు ప్రగాఢమైన భక్తిభావం కలిగింది. అక్కడ ఎలాంటి ఆర్భాటం లేదు, విరాళాలు లేవు, వీఐపీ క్యూలు లాంటివేమీ లేవు. అది చాలా నిరాడంబరంగా, స్వచ్ఛంగా ఉంది. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. అందుకే అంత ప్రశాంత వాతావరణం అక్కడ కనిపించింది’ అని తెలిపింది.

Next Story