- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keerthy Suresh: బాలీవుడ్ అగ్ర హీరోతో రొమాన్స్ చేయబోతున్న మహానటి.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్?
ప్రస్తుతం కీర్తి సురేష్ (Keerthy Suresh) అటు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఇటు సినిమాల్లో రాణిస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కీర్తి సురేష్ (Keerthy Suresh) అటు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఇటు సినిమాల్లో రాణిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీ భాషల్లో కూడా నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. తన అందం, నటన, అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఈ హీరోయిన్ మహానటి చిత్రంతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ బ్యూటీకి తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. స్టార్ హీరోలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)సోదరురాలిగా నటించి మెప్పించింది.
ఇక ఈ బ్యూటీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్ సరసన బేబీ జాన్ చిత్రంలో అవకాశం దక్కించుకున్న కీర్తి సురేష్.. బాలీవుడ్ మరో ప్రముఖ హీరోతో రొమాన్స్ చేసే అవకాశం సంపాదించుకున్నట్లు నెట్టంట గట్టి టాక్ వినిపిస్తోంది.
డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ మహానటి ఏకంగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తో జోడి కట్టనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. రణ్‌బీర్ అండ్ కీర్తి సురేష్ జోడి కచ్చితంగా జనాల్ని ఆకట్టుకుంటుందని.. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read More..
Sreeleela: అతడికి బర్త్డే విష్ చేస్తూ చిన్ననాటి ఫొటో పంచుకున్న శ్రీలీల.. ఎంత బొద్దుగుందో!






