ప్రజా దర్బార్‌కు మంచి స్పందన వస్తోంది: మంత్రి సీతక్క

by Ajay Maddhiboyina |

మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌ర్రిగూడెంలో మంత్రి సీత‌క్క ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా ద‌ర్భార్ లో పాల్గొని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. అనంత‌రం మాట్లాడుతూ.. ప్ర‌జాద‌ర్బార్ కు మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని అన్నారు.

ప్రజా దర్బార్‌కు మంచి స్పందన వస్తోంది: మంత్రి సీతక్క
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌ర్రిగూడెంలో మంత్రి సీత‌క్క ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా ద‌ర్భార్ లో పాల్గొని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. అనంత‌రం మాట్లాడుతూ.. ప్ర‌జాద‌ర్బార్ కు మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని అన్నారు. సంప్ర‌దాయ ఉత్ప‌త్తుల‌కు రాబోయే రాజుల్లో మరింత ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెప్పారు. మేడారం జాత‌ర‌లో ఇప్ప‌పువ్వు ల‌డ్డు ప్ర‌సాదంగా పెట్టామ‌ని అన్నారు. ఇప్ప‌పువ్వు ల‌డ్డులో మంచి విట‌మిన్లు ఉంటాయ‌ని, ఇప్ప‌పువ్వు ల‌డ్డులు తిన‌డం వ‌ల్ల ఆడ‌వాళ్ల‌కు ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంద‌ని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలోని హాస్ట‌ళ్ల‌లో కూడా ఇప్ప‌పువ్వు ల‌డ్డుల‌ను ఆహారంగా ఇచ్చామ‌ని అన్నారు. అంగ‌న్వాడీలోనూ ఈ లడ్డూలు అందించామ‌ని తెలిపారు. రెండు మూడు ఏళ్ల త‌ర‌వాత వారిలో ర‌క్త హీన‌త త‌గ్గింద‌ని అన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పపువ్వు ల‌డ్డు ఉత్పత్తి పెరుగుతుంద‌ని, మార్కెట్ కూడా పెరుగుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం పేపర్ ప్లేట్ ల‌లో భోజ‌నాలు చేస్తున్నార‌ని దాని వ‌ల్ల క్యాన్స‌ర్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. అడ‌విలో దొరికే ఆకుల‌తో విస్త‌రాకులు చేయ‌వ‌చ్చ‌ని, దానికోసం మిష‌న్లు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. కాబ‌ట్టి విస్త‌రాకుల‌తోనూ వ్యాపారం చేసి ఆదాయం పొంద‌వ‌చ్చ‌ని అన్నారు.

Next Story