- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: అతడికి బర్త్డే విష్ చేస్తూ చిన్ననాటి ఫొటో పంచుకున్న శ్రీలీల.. ఎంత బొద్దుగుందో!
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల మళ్లీ సినిమాల జోరు పెంచింది. మొదట్లో గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపింది. ఏకంగా అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు సంపాదించుకుని అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.
మాస్ మహారాజా రవితేజ, సీనియర్ ప్రముఖ హీరో బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అలాగే ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం, నటనలో మాత్రమే కాకుండా.. డ్యాన్స్ లో కూడా ఇరగదీస్తుంది. ఈ అమ్మడు వేసే ఒక్కొక్క స్టెప్పుకు కుర్రాళ్లకు చెమటలు పట్టాలి.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి మాస్ స్టెప్పులేసి దుమ్మురేపింది. కిస్సిక్ అంటూ కునుకు లేకుండా చేసిందనడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ హీరోయిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28 వ తారీకుల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.
నితిన్ సరసన నటించిన ఈ అమ్మడు యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీరితో పాటుగా.. ఈ మూవీలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
ఇకపోతే శ్రీలీల తాజాగా సోషల్ మీడయా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌తో తన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందులో తన అన్నయ్యతో ఉన్న చిన్ననాటి ఫొటోను పంచుకుంది. చాలా బొద్దుగా, చిన్న స్మైల్ ఇస్తూ ఈ పిక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోకు శ్రీలీల.. ‘హ్యాపీ బర్త్డే అన్న. నా ఏప్రిల్ ఫూల్ జోక్ ఎప్పటికీ పాతది కాదు’ అంటూ రాసుకొచ్చింది.






