Kayadhu Lohar: ‘పళ్లిచట్టంబి’ నుంచి కయదు ఫస్ట్ లుక్..

by Chukka Sudharani |   (  Updated:2026-02-02 17:35:16  IST  )

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’.

Kayadhu Lohar: ‘పళ్లిచట్టంబి’ నుంచి కయదు ఫస్ట్ లుక్..
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా కయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. డ్రాగన్ మూవీ సక్సెస్ తర్వాత ఆడియెన్స్‌లో పెరిగిన ఆమె క్రేజ్ ఈ సినిమాను ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ‘పళ్లిచట్టంబి’ మోషన్ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా.. సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏప్రిల్ 9న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ ఇప్పటివరకు ఎన్నడు చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read more... సక్సెస్‌కు ఇదే మా తొలిమెట్టు.. రణబాలి టైటిల్ గ్లింప్స్ సక్సెస్‌పై టీమ్ కామెంట్స్

Next Story