- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సక్సెస్‌కు ఇదే మా తొలిమెట్టు.. రణబాలి టైటిల్ గ్లింప్స్ సక్సెస్‌పై టీమ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’ సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రాబోతోంది. ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నా ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 15 మిలియన్ ఫ్లస్ వ్యూస్‌తో ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సాధించబోయే సక్సెస్‌కు టైటిల్ గ్లింప్స్‌కు వస్తున్న స్పందనే ఫస్ట్ స్టెప్‌గా మూవీ టీమ్ భావిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ రణబాలి అనే యోధుడి పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. జయమ్మగా రశ్మిక మందన్న ఆకర్షించింది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘రణబాలి’ రూపొందుతోండగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






