- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు ఆ భాషలో విడుదలకు సిద్ధమైన కరుప్పు
ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య.

దిశ, సినిమా: ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మే 15న వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి.. రెండు వారాలు అవుతున్న పలు చోట్ల ఇప్పటికి థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తెలుగులో, తమిళంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందడంతో ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు హిందీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. ‘తమిళం, తెలుగు భాషల్లో మీ అపారమైన ప్రేమను పొంది... ఇప్పుడు హిందీలో మీ ముందుకు వస్తున్నాం.. కరుప్పు హిందీ ట్రైలర్ వచ్చేసింది.. ఎమోషనల్ రైడ్‌ను వీక్షించండి’ అంటూ చెప్పుకొచ్చారు.






