- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BMW మూవీలో కార్తీక దీపం సాంగ్...రవితేజ ఊర మాస్ డ్యాన్స్
కార్తీక దీపం డిజె సాంగ్ ను ఈ సినిమాలో వాడుకుంది చిత్ర బృందం.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ హీరోగా చేయగా, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా మెరువనున్నారు. సంక్రాంతి కానుకగా ఇవాళ రిలీజ్ అయిన ఈ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. మాస్ యాక్షన్, అదిరిపోయే కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు జనాలు కూడా ఎగబడుతున్నారు.
ముఖ్యంగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' లో పాటలు మాత్రం అందరికీ పిచ్చెక్కిస్తున్నాయట. కమెడియన్ సత్యతో ఓ పాటను వాడుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల.. రవితేజతో కూడా మాస్ పాటకు డ్యాన్స్ చేయించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ తెలియకుండా ఈ పాటను గోప్యంగా ఉంచారు. కార్తీక దీపం డిజె సాంగ్ ను ఈ సినిమాలో వాడుకుంది చిత్ర బృందం.
ఇందులో రవితేజ చేసే డాన్స్.. అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పాట రాగానే థియేటర్ లో జనాలు ఎగిరి గంతేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా రవితేజ నటించిన ఈ సినిమాలో సునీల్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, వెన్నెల కిషోర్, సత్య కామెడీ పండించారట. అటు శుభలేఖ సుధాకర్ లాంటి సీనియర్లు కూడా ఇందులో నటించారు. మొత్తానికి ఈ సినిమాతో రవితేజ బ్యాక్ అంటున్నారు.
Read More..
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్... రవితేజ బయటపడ్డట్టేనా?






