సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కోలీవుడ్ స్టార్ కార్తీ సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

by Chukka Sudharani |   (  Updated:2026-05-07 10:22:29  IST  )

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో కార్తీ చేయబోతున్న సినిమా తాజాగా పూజాకార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయింది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కోలీవుడ్ స్టార్ కార్తీ సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కాంబినేషనల్ ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో మల్టీస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీ కాంబోలో ఈ సినిమా రాబోతుండగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుండగా.. బాక్సాఫీస్ వద్ద నెక్ట్స్ లెవల్ ఎంటర్‌టైనింగ్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్లు.

Read More.. అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ఎవరు ఊహించని సంగీత దర్శకుడు?

Next Story