- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ఎవరు ఊహించని సంగీత దర్శకుడు?
అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాల కోసం ఎప్పటికప్పుడు సంగీత దర్శకులను మారుస్తూ ఉంటాడు. కెరీర్ ప్రారంభంలో సాయి కార్తీక్‌తో కలిసి పనిచేసిన ఆయన, ఆ తర్వాత పలు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని తీసుకున్నారు. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా, సంగీతానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమాకు కూడా భీమ్స్ కొనసాగుతారని చాలామంది భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిని మార్చినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి ఆయనతో సంప్రదింపులు జరపగా, జీవీ ప్రకాష్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. సమ్మర్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.






