‘కన్నప్ప ప్రభాస్ వల్లేం హిట్ కాలేదు’ కానీ.. కాకరేపుతున్న సినిమా రివ్యూ

by Kodari Anjali |   (  Updated:2025-06-28 06:04:10  IST  )

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించి.. నిన్న (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

‘కన్నప్ప ప్రభాస్ వల్లేం హిట్ కాలేదు’ కానీ.. కాకరేపుతున్న సినిమా రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించి.. నిన్న (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీపై నెటిజన్లు మొదటి నుంచే భారీ అంచనాలు పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా హిందూమతంలో శివుని భక్తుడైన కన్నప్ప పురాణం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు , ఆర్. శరత్‌కుమార్, అర్పిత్ రాంక, బ్రహ్మానందం, బ్రహ్మాజీ , శివ బాలాజీ , కౌశల్ మందా, రాహుల్ మాధవ్ , దేవరాజ్ , ముఖేష్ రిషి, రఘుబాబు, ప్రీతి ముఖుందన్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించి బాక్సాఫీసును షేక్ చేశారు.

ఇక కన్నప్ప సినిమా గురించి ఇప్పటివరకు అయితే చాలా మంది నెటిజన్లు అండ్ సినీ ప్రముఖులు గొప్పగా చెబుతున్నారు. ఆడియన్స్ అయితే థియేటర్ల వద్దనే కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ అంటూ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయినప్పటికీ.. సెకండ్ హాఫ్ వేరే లెవల్ అంటూ సినిమాలోని నటీనటుల్ని కొనియాడుతున్నారు. చివర్లో అయితే బీజీఎమ్, మంచు విష్ణు పర్ఫామెన్స్ సూపర్ అంటున్నారు. కన్నప్పలోని పాన్ ఇండియా స్టార్ పాత్ర అలాగే ఇతర ప్రముఖుల రూల్స్ అద్భుతంగా చిత్రీకరించారంటూ నెట్టింట రివ్యూల మోత మోగుతోంది.

అయితే తాజాగా థియేటర్ వద్ద మంచు మనోజ్ అండ్ కొంతమంది ఈ చిత్రంపై చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘కన్నప్ప సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్‌లో ఇంత గొప్ప పర్మామెన్స్ చేస్తారని కళ్లో కూడా ఊహించలేదు. నేను అనుకున్నదాని కంటే వెయ్యి రేట్లు బాగుంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. సినిమా కోసం పెట్టిన డబ్బు వెయ్యింతలు రిటర్న్ రావాలని కోరుకుంటున్నాను’ అంటూ మనోజ్ మాట్లాడారు. అలాగే ‘సినిమా ఓవర్ ఆల్‌గా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లు అందరూ చూసే సినిమా ఇది. కన్నప్పలో నటీనటులు అందరూ న్యాయం చేశారు’ అని చెప్పుకొచ్చారు.

ప్రభాస్ వల్లే మూవీ హిట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. ‘‘సినిమా మొత్తం ప్రభాస్ వల్లేం హిట్ కాలేదు. కానీ ప్రభాస్ క్యారెక్టర్ వల్ల హిట్ అవుతుంది. అలా అనుకుంటే ప్రభాస్ ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు అన్నీ హిట్ కాలేదు కదా? కానీ ఆయన్ను చూపించే విధానం వల్ల సినిమా హిట్ అవుతుంది’ అని ఓ నెటిజన్ వెల్లడించారు. అలాగే మరికొంతమంది ప్రభాస్ థియేటర్‌ను షేక్ చేస్తే.. మంచు విష్ణు గూస్‌బంప్స్ తెప్పించాడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More..

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రాజాసాబ్ నుంచి క్రేజీ అప్డేట్..!

Next Story