- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రాజాసాబ్ నుంచి క్రేజీ అప్డేట్..!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ ప్రపంచ స్థాయికి ఎదిగింది. అప్పటినుంచి ఏడాదికి ఒక్కటి చొప్పున సినిమాలు మాత్రమే తీస్తున్నాడు. అంతేకాదు... ప్రభాస్ తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా కావడం గమనార్హం.
ఇక ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను మారుతి చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ కోసం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను పెట్టాడు దర్శకుడు మారుతి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ ముగ్గురు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఉన్నాడు. తమన్ మ్యూజిక్ అదరగొడుతున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. జులై మొదటి వారంలో.. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఉండనుందట. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనబోతున్నాడని సమాచారం. హైదరాబాద్ లో నిర్మించిన ప్యాలెస్ సెట్ లో.. ఈ చివరి షెడ్యూల్ మొత్తం జరగనుందని సమాచారం. ఇక్కడ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. దింతో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సబ్బరపడిపోతున్నారు.
Read More..
‘కన్నప్ప ప్రభాస్ వల్లేం హిట్ కాలేదు’ కానీ.. కాకరేపుతున్న సినిమా రివ్యూ






