హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండకపోవడంపై కాజల్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-18 07:56:08  IST  )

సినీ నటీమణుల జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుందని, ఆ కారణం వల్లే రిలేషన్‌షిప్‌ల విషయంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పింది.

హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండకపోవడంపై కాజల్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రామాయణ’, ‘ది ఇండియా స్టోరీ’, బాలకృష్ణ నటిస్తున్న ‘NBK-111’, ‘తథాస్తు’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా వరుస షూటింగులు, ప్రమోషన్లతో తీరిక లేకుండా గడుపుతున్న కాజల్.. తాజాగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితం, వారి ప్రేమ వ్యవహారాలు,రిలేషన్‌షిప్‌లపై సోషల్ మీడియాలో జరిగే చర్చలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చి చెక్ పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఎక్కువగా సీరియస్ రిలేషన్‌షిప్‌లలో ఎందుకు కనిపించరు? చాలామంది తమకు బాయ్‌ఫ్రెండ్స్ లేరని ఎందుకు చెబుతుంటారు?" అనే ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ.. సినీ నటీమణుల జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుందని, ఆ కారణం వల్లే రిలేషన్‌షిప్‌ల విషయంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పింది. "ఒక హీరోయిన్‌గా ఆ సిట్యుయేషన్‌ను నేను చాలా బాగా అర్థం చేసుకోగలను.

హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండకపోవడానికి లేదా ప్రేమలో పడకపోవడానికి ప్రధాన కారణం వాళ్లకు అస్సలు సమయం లేకపోవడమే" అని కాజల్ స్పష్టం చేసింది. నిరంతరం షూటింగులు, ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలు, సినిమాల ప్రమోషన్లు.. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన సమయాన్ని కేటాయించడం ఎవరికైనా చాలా కష్టంగా మారుతుందని, అందుకే చాలామంది కెరీర్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించింది. అయితే ఇది పూర్తిగా వారి వారి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని కూడా ఆమె పేర్కొంది. ఇక హీరోయిన్లకు ఉండే క్రష్‌ల గురించి కూడా కాజల్ ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఎదుగుతున్న వయసులో ఎవరికైనా క్రష్‌లు ఉండటం చాలా సహజమైన విషయమని చెప్పింది. తన కాలేజీ రోజుల్లో తనకు కూడా క్రష్‌లు ఉండేవారని కాజల్ ఓపెన్‌గా ఒప్పుకుంది. అప్పట్లో తన మనసు దోచిన ఆ క్రష్‌లు.. ఇప్పటికీ తన జీవితంలో ఎంతో మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే.. పెళ్లిపై సారా అలీఖాన్ షాకింగ్ రియాక్షన్

Next Story