- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే.. పెళ్లిపై సారా అలీఖాన్ షాకింగ్ రియాక్షన్
నన్ను నేను పూర్తిగా మార్చుకోవడానికి, ఒక సంపూర్ణమైన మనిషిగా ఎదగడానికే నేను ఇష్టపడతాను. నన్ను ఎవరో వచ్చి పూర్తి చేయాల్సిన అవసరం లేదు

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పతి పత్ని ఔర్ వో దో’. ఈ సినిమా ఇటీవల మే 15న విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. నేటితరం ప్రేమకథలు, పెళ్లి బంధాల్లో వచ్చే సమస్యలను ఎంతో ఆసక్తికరంగా చూపించగా.. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అలీ ఖాన్ పెళ్లి బంధాన్ని ఎంతో ప్రాక్టికల్‌గా చూస్తానని, దాన్ని చూసి అనవసరంగా ఊహల్లో తేలిపోనని ఓపెన్‌గా స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని పెళ్లి బంధాలు విడిపోవడాన్ని కళ్లారా చూసిన సారా.. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్, సొంత ఎదుగుదల పైనే ఉందని, లైఫ్ పార్ట్‌నర్‌ను ఎంచుకునే విషయంలో అస్సలు తొందరపడనని చెప్పుకొచ్చింది. "మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ చూసే సంఘటనల నుంచే మన ఆలోచనలు పుడతాయి. కాస్త సీరియస్‌గా అనిపించినా ఒక నిజం చెప్పాలి.
మన కళ్ల ముందే ఎన్నో పెళ్లిళ్లు విఫలమవ్వడం నేను చూశాను. అందుకే హడావుడిగా పెళ్లి చేసుకునే కంటే, కాస్త సమయం తీసుకుని సరైన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటం చాలా మంచిది" అని సారా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఒకవేళ సరైన వ్యక్తి దొరకకపోతే తాను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమేనని సారా తెగేసి చెప్పింది. "నన్ను నేను పూర్తిగా మార్చుకోవడానికి, ఒక సంపూర్ణమైన మనిషిగా ఎదగడానికే నేను ఇష్టపడతాను. నన్ను ఎవరో వచ్చి పూర్తి చేయాల్సిన అవసరం లేదు. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నన్ను గౌరవించి, నా సంతోషాన్ని పంచుకునే వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి మాత్రం నా దృష్టి కేవలం సినిమాలపైనే ఉంది" అని చెప్పుకొచ్చింది.






