Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్‌ను వెంట్రుకతో పోల్చిన కాజల్..!

by Disha Web Desk 7 |
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్‌ను వెంట్రుకతో పోల్చిన కాజల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ చందమామగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి రాణించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఓ కుమారుడికి జన్మనిచ్చింది. గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ ఫామ్‌లోకి వస్తుంది. తన వద్దకు వచ్చిన అన్ని సినిమాలను ఒకే చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కాజల్ ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాను వెంట్రుకతో పోల్చిందని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్‌లో ఓ న్యూ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఓ పాత్ర నటించాలని కాజల్‌ను వశిష్ట కోరారట. అయితే దానికి కాజల్ ఏమాత్రం ఆలోచించకుండా చేయనని ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. అంతేకాకుండా.. నా దృష్టిలో నా పాత్రకు ఇంపార్టెన్స్ లేని రోల్ నా వెంట్రుకతో సమానం. కేవలం సైడ్ క్యారెక్టర్స్‌లా ఉండి సినిమాలో ఉన్నాను అంటే ఉన్నాను అనే పాత్ర ఇస్తే ఒప్పుకోను.. ఊరుకోను. నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. గ్లామర్ పరంగా టచ్ లేకపోయినా కనీసం కథలో నేను ఇంపార్టెంట్ అవ్వాలి. అలాంటి పాత్రను నేను చేస్తాను’’ అంటూ ముఖం మీదనే చెప్పి షాకిచ్చిందట.

ఇవి కూడా చదవండి : కళ్లు కాదు కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడు?


Next Story