కళ్లు కాదు కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడు?

by Disha Web Desk 10 |
కళ్లు కాదు కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడు?
X

దిశ, సినిమా : విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ టీజర్ ఆకట్టుకుంటోంది. ‘కళ్లు మోసం చేశాయేమో అని నువ్ అంటున్నావ్.. కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా’.. ‘వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ.. చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రులు లేరు’.. అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తుండగా.. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుండగా.. సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్‌ను వెంట్రుకతో పోల్చిన కాజల్..!

Next Story