- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్యోతిక కీలక నిర్ణయం.. తృప్తినిచ్చే పాత్రల కోసం ఎన్నేళ్లైనా ఎదురుచూస్తానంటూ కామెంట్స్
ఒకే రకమైన పాత్రలను పదే పదే చేస్తూ పోవడం వల్ల నటిగా నాకు ఎలాంటి తృప్తి ఉండదు. అందుకే ప్రేక్షకులపై ఒక బలమైన ముద్ర వేసే, వైవిధ్యభరితమైన పాత్రల కోసమే నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక నిత్యం వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్‌గా మారిన ఆమె, సూర్యను ప్రేమ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సినిమాలకు కొద్ది కాలం గ్యాప్ తీసుకున్న జ్యోతిక.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. కేవలం తమిళంలోనే కాకుండా బాలీవుడ్, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక, సినిమాల్లో తన పాత్రల ఎంపికపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఒకే రకమైన పాత్రలను పదే పదే పోషించడంపై తనకు అస్సలు ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేసింది. వినూత్నంగా, సమాజానికి అర్థవంతంగా అనిపించే సరికొత్త పాత్రల కోసం ఎంత కాలమైనా వేచి ఉండటానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించింది.
తమిళ చిత్రసీమలో తాను ఇప్పటికే ఉపాధ్యాయురాలు, న్యాయవాది, జిల్లా కలెక్టర్, గృహిణి వంటి ఎన్నో విభిన్న రకాల పాత్రలను పోషించినట్లు గుర్తు చేసుకుంది. అందుకే ఇకపై కూడా రొటీన్ పాత్రలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పింది. “ఒకే రకమైన పాత్రలను పదే పదే చేస్తూ పోవడం వల్ల నటిగా నాకు ఎలాంటి తృప్తి ఉండదు. అందుకే ప్రేక్షకులపై ఒక బలమైన ముద్ర వేసే, వైవిధ్యభరితమైన పాత్రల కోసమే నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను’’ అని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ కోసం అవసరమైతే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఖాళీగా ఉండటానికైనా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జ్యోతిక తేల్చి చెప్పింది. కేవలం స్క్రీన్ మీద కనిపించడం ముఖ్యం కాదని, ఒక బలమైన, ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే పాత్ర లభించినప్పుడు మాత్రమే నటించడానికి తాను ఇష్టపడతానని ఆమె స్పష్టం చేసింది. సీనియర్ హీరోయిన్లలో జ్యోతిక తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.






