ఇది కేవలం సినిమా పబ్లిసిటీ కోసం చేసే పని కాదు.. ప్రజలకు దగ్గరయ్యేందుకు చేస్తున్నా: శ్రీలీల

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-27 06:31:13  IST  )

నా విషయానికి వస్తే, నేను ప్రతి భాషను ఎంతో గౌరవిస్తాను. నేను స్వయంగా నాలుగు, ఐదు భాషల్లో పని చేస్తున్నాను.

ఇది కేవలం సినిమా పబ్లిసిటీ కోసం చేసే పని కాదు.. ప్రజలకు దగ్గరయ్యేందుకు చేస్తున్నా: శ్రీలీల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను రాబట్టుకుని మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన డాన్స్, చలాకీతనంతో యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆమె చేసిన చిత్రాలు గత కొద్ది కాలంగా హిట్ అందుకోలేకపోతున్నప్పటికీ అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ‘D-55’ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించనుంది. అలాగే బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘ఆషికీ-3’లో చేస్తోంది. తన యాక్టింగ్, డాన్స్‌లతోనే కాకుండా తన ఆలోచనలతోనూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. భాష, సంస్కృతి వివిధ ప్రాంతాల ప్రేక్షకుల పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో భాషా భేదాలు లేకుండా నటీనటులు అన్ని పరిశ్రమల్లోనూ నటిస్తున్నారు.

ఇలాంటి సమయంలో, వేరే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడి స్థానిక భాష మాట్లాడటం ఎంత ముఖ్యమో శ్రీలీల చాలా చక్కగా వివరించింది. వివిధ ప్రాంతాల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం గురించి శ్రీలీల మాట్లాడుతూ.. "నా విషయానికి వస్తే, నేను ప్రతి భాషను ఎంతో గౌరవిస్తాను. నేను స్వయంగా నాలుగు, ఐదు భాషల్లో పని చేస్తున్నాను. నేను ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ స్టేజ్ మీద ఉన్నంతసేపూ స్థానిక భాషలోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రాంతానికి, అక్కడి భాషకు ప్రజలకు నేను ఇచ్చే కనీస గౌరవం అది" అని చెప్పుకొచ్చింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో స్థానిక భాషలో మాట్లాడటం వల్ల ప్రేక్షకులకు, స్టార్స్‌కు మధ్య ఉన్న దూరం తగ్గి, ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని శ్రీలీల అభిప్రాయపడింది. ఇది కేవలం సినిమా పబ్లిసిటీ కోసం చేసే పని కాదని, మనల్ని సెలబ్రిటీలుగా గుర్తించిన ఆయా ప్రాంతాల ఐడెంటిటీని గౌరవించడమేనని ఆమె స్పష్టం చేసింది. శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయం.. భాష పట్ల ఆమెకున్న గౌరవం చూసి నెటిజన్లు, సినీ ప్రియులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

జ్యోతిక కీలక నిర్ణయం.. తృప్తినిచ్చే పాత్రల కోసం ఎన్నేళ్లైనా ఎదురుచూస్తానంటూ కామెంట్స్

Next Story