- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jr NTR : ఎన్నో ఒడిదుకులు ఎదురైన నా వెంటే నిలిచారు : Jr. ఎన్టీఆర్ థాంక్స్ పోస్ట్
తెలుగు సినీ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టినరోజు నేడు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టినరోజు నేడు. తన 42వ జన్మదినం(Jr NTR Birthday) సందర్భంగా తన అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల విషెస్ పై స్పందిస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తన X ఖాతా వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ షేర్ చేశారు. ఎన్టీఆర్ తన పోస్ట్‌లో "నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా, అభిమానులు నా వెన్నంటే తోడుగా, బలంగా నిలిచారు. నా సినిమాలు, పాత్రలు మీ కోసమే. మీ ప్రేమ అమూల్యం. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నేనేం పుణ్యం చేశానో అనిపిస్తుంది. 'దేవర' సినిమాకు మీరు చూపించిన ఆదరణ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఈ రోజును నాకు ఎంతో ప్రత్యేకం చేసిన అభిమానులు, స్నేహితులు, కుటుంబం, సినీ పరిశ్రమలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని రాశారు. ఎన్టీఆర్ హార్ట్ ఫుల్ గా రాసిన ఈ పోస్ట్‌కు అభిమానులు “లవ్ యు అన్న” అంటూ స్పందించగా.. లక్షలాది లైక్‌లు వచ్చాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్ కు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, హృతిక్ రోషన్ తదితర సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ తాజా చిత్ర 'వార్ 2'(War 2) చిత్రం ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
NTR: గాయంతో కనిపించిన ఎన్టీఆర్.. ఫొటోలు చూసిన షాక్ అవుతున్న ఫ్యాన్స్






