- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR: గాయంతో కనిపించిన ఎన్టీఆర్.. ఫొటోలు చూసిన షాక్ అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో హిట్ సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో హిట్ సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ హిందీలో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ‘వార్-2’(War-2) గ్లింప్స్ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఇదంతా పక్కనపెడితే.. తారక్ బర్త్ డే కావడంతో అభిమానులతో పాటు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ కూడా ఎన్టీఆర్‌కు విషెస్ తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఫొటోలు షేర్ చేశారు. ఇక ఇందులో రెడ్ కలర్ శాల్వా కప్పుతూ కనిపించారు. అయితే తారక్ మాత్రం ఒక చేతికి గాయంతో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
కదిలించలేక ఒంటి చేతితో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు మాత్రం జిమ్ గాయం అయిందా? లేక షూటింగ్‌లో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న క్రమంలో గాయం కావడంతో ఎన్టీఆర్-నీల్ సినిమా కోసమే ఆయన వర్కౌట్స్ చేసి బాగా కష్టపడుతున్నారని అంటున్నారు.






