- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jr.NTR: తాత స్మరణలో తారక్.. ఎన్టీఆర్ జయంతి వేళ ఘాట్ వద్ద నివాళులు
మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గ్లోబల్ స్టార్జూ నియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి వారసుడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇవాళ తెల్లవారుజామునే వెళ్లి తాతకు ఘన నివాళులర్పించారు.
కాగా, ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తన తాతగారి పుట్టినరోజున తారక్ ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు. నందమూరి తారకరామారావు సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, చేతులు జోడించి కళ్లు మూసుకుని కాసేపు మౌనం పాటించారు. తన తాతగారితో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తారక్‌తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. నందమూరి హీరోలు వస్తున్నారనే సమాచారంతో తెల్లవారుజామునే ఘాట్ పరిసర ప్రాంతాలకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ‘జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్’ అంటూ అభిమానులు చేసిన నినాదాలు మారుమోగాయి.






