- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుగ పురుషుడికి మెగాస్టార్ నివాళి.. ఎన్టీఆర్ జయంతి వేళ చిరంజీవి వైరల్ పోస్ట్!
మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగభరిత నివాళులర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకుంటూ ‘X’ (ట్విట్టర్) వేదికగా ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ఎన్ని తరాలు మారినా చరిత్రలో ఎన్టీఆర్ ప్రభావం ఎప్పటికీ చెరిగిపోదని, తెలుగు సినిమా ఆయన లేకుండా ఊహించలేమని చిరంజీవి కొనియాడారు. రామారావు గారు కేవలం సినిమా కోసమే జన్మించారని మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు.
ఎన్టీఆర్ పురస్కారం దక్కడం అదృష్టం..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల వేడుకలో చిరంజీవి ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని’ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ అవార్డు ఆ స్పందిస్తూ... తెరపై అనేక పాత్రలకు జీవం పోసి, ప్రజాజీవితంలో తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ఆ యుగపురుషుని పేరిట ఉన్న అవార్డును అందుకోవడం తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన గౌరవంగా, మధురమైన గుర్తింపుగా భావిస్తున్నట్లుగా తెలిపారు. అయితే, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి, ఆయన ఆశయాలకు నివాళులు అర్పిస్తూ మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






