- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమల్ హాసన్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి క్లారిటీ
తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు.

దిశ, సినిమా: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా.. జేడీ చక్రవర్తి చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో తన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చెబుతూ.. ఏకంగా కమల్ హాసన్ పేరును ప్రస్తావించారు. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసినప్పటికీ, ‘గాయపడ్డ సింహం’లో నేను చేస్తున్నటువంటి డిఫరెంట్ ఆయనకు ఇప్పటి వరకు వచ్చి ఉండదు అంటూ తెలిపారు. ఈ మాటలను మీరు ట్రోల్స్ చేస్తారేమో.. ‘కమల్ హాసన్ ఒక అద్భుతం. ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను.. ఇలాంటి పాత్ర ఆయనకు వచ్చి ఉండదు.. అని మాత్రమే నేను అన్నది’ అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు జేడీ చక్రవర్తి. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి స్వీకార్ అగస్తీ సంగీతం అందిస్తుండగా.. పవన్ సాదినేని సమర్పణలో రూపొందుతోంది.
భారీ రిస్క్‌కు రెడీ అయిన నిర్మాత అనిల్ సుంకర.. ఒకేసారి ఐదు సినిమాలు సెట్స్‌పైకి






