భారీ రిస్క్‌కు రెడీ అయిన నిర్మాత అనిల్ సుంకర.. ఒకేసారి ఐదు సినిమాలు సెట్స్‌పైకి

by Pulgam srinivas |

నిర్మాత అనిల్ సుంకర ఏకంగా ఐదు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

భారీ రిస్క్‌కు రెడీ అయిన నిర్మాత అనిల్ సుంకర.. ఒకేసారి ఐదు సినిమాలు సెట్స్‌పైకి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపును సంపాదించారు. తాజాగా ఈ నిర్మాత శర్వానంద్ హీరోగా నారీ నారీ నడుమ మురారి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ జోష్‌లో ఈ నిర్మాత ఏకంగా ఐదు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సందీప్ కిషన్ లతో ఒక్కొక్క సినిమాను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరో ఇద్దరు హీరోలతో కూడా రెండు ప్రాజెక్టులను త్వరలోనే ఓకే చేయాలనే ఆలోచనలో ఈ నిర్మాత ఉన్నట్లు సమాచారం. ఇలా ఒకేసారి ఐదు సినిమాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో, ఇది చాలా పెద్ద రిస్క్ అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏ మాత్రం తేడా జరిగినా, భారీ పెట్టుబడుల కారణంగా ఈ నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story