యూట్యూబ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న 'జయ జానకి నాయక'

by Pulgam srinivas |   (  Updated:2026-06-30 07:02:57  IST  )

'జయ జానకి నాయక' హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

యూట్యూబ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న జయ జానకి నాయక
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు మాస్ చిత్రాలకు హిందీ ప్రేక్షకుల నుంచి ఎప్పటికప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా థియేటర్ల కంటే యూట్యూబ్‌లో మన తెలుగు డబ్బింగ్ సినిమాలు భారీ స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'జయ జానకి నాయక' చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఈ చిత్రాన్ని హిందీలో 'జయ జానకి నాయక్ ఖూన్‌ఖార్' అనే పేరుతో 2019 ఫిబ్రవరి 8న పెన్ స్టూడియోస్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. విడుదలైన ఏడు సంవత్సరాల్లో 1 బిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఈ స్థాయిలో ఆదరణ లభించడం విశేషమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులే మరింతగా ఆదరించారని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.

రకుల్ హాట్ స్టిల్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అందాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ

Next Story