- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీపై లారెన్స్ క్లారిటీ.. త్రిష పరిస్థితిపై జోరుగా చర్చ
తిరుచ్చి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, రాజకీయ ఎంట్రీపై అంత హడావుడి లేదని ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతూనే సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. హడావుడిగా ఎమ్మెల్యేనో, మంత్రినో అవ్వాలని లేదని ఏ పార్టీలో చేరాలనే దానిపై హడావుడిగా నిర్ణయం తీసుకోలేనన్నారు. ఇది కూరగాయల మార్కెట్ కాదని వెళ్లేచోట మనకు గౌరవం ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా సామాజిక సేవ మరియు సినిమా ప్రాజెక్టులపైనే ఉందని, ఎన్నికల బరిలో నిలిచే ఆలోచన లేదని ఆయన మీడియాకు వివరించారు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి. ప్రతిఫలంగా దేనినీ ఆశించకు అని రాస్తు సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనను అభిమానిస్తున్న అండగా ఉంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా గతంలో ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని లారెన్స్ ప్రటించారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. దీనిపై తాజాగా మరోసారి స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
త్రిషకు రూట్ క్లియర్!
ఇదిలా ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లో పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయగా త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ స్థానం నుంచి నటి త్రిషను టీవీకే తరఫున బరిలోకి తింపబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతలో లారెన్స్ పేరు తెరపైకి రావడంతో త్రిషకు బదులు లారెన్స్ ను రంగంలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ తాజాగా ఈ ఉప ఎన్నిక బరిలో తాను లేనని లారెన్స్ ప్రకటించడంతో ఈ బై ఎలక్షన్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు త్రిషకు రూట్ క్లియర్ అయిందనే చర్చ తమిళనాడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జరుగుతున్న ప్రచారం మేరకు త్రిష తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలో ఉంటారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






