- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akkineni Akhil: 'లెనిన్' ట్రైలర్‌తో శరత్ థియేటర్ షేక్ అవుతుంది.. ఒక్క పోస్టుతో అంచనాలు పెంచేశాడు
'లెనిన్' ట్రైలర్‌తో వైజాగ్ శరత్ థియేటర్ షేక్ అవుతుందని అఖిల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాను జూలై 10న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 4 గంటలకు వైజాగ్‌లోని శరత్ థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ నిన్న అధికారికంగా ప్రకటించారు. తాజాగా అఖిల్ తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "తమన్... నువ్వు ఇరగదీశావు. వైజాగ్ శరత్ థియేటర్ షేక్ అవుతుంది. ట్రైలర్‌లో చివరి ఒక్క నిమిషం మాత్రం ర్యాంప్ ఆడావు బాబు" అంటూ అఖిల్ పోస్ట్ చేశాడు.
దీంతో 'లెనిన్' ట్రైలర్ అద్భుతంగా ఉండబోతోందని, ముఖ్యంగా ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని అక్కినేని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.






