మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు

by Ratna Kumari |

నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని, అభివృద్ధినే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తెలిపారు.

మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని, అభివృద్ధినే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ చంద్రకళ మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వృద్ధి చర్యలు, పరిపాలనా అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ములుగు పట్టణ అభివృద్ధి, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే కౌన్సిల్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Next Story