- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాజీ బర్త్ డే స్పెషల్.. ‘హైలెస్సో’ నుంచి పవర్ ఫుల్ లుక్ విడుదల చేసిన మేకర్స్
సినిమాలో ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో శివాజీ ‘లైలం బాబు’ అనే ఒక పవర్‌ఫుల్, కాకరేపే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.

దిశ, సినిమా: ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఫ్యామిలీ హీరోగా నటించి మెప్పించిన శివాజీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గానూ నటిస్తున్నారు. గత ఏడాది కోర్ట్, దండోరా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శివాజీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ‘సుత్తిని సుద్దపూసిని’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివాజీ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర దక్కించుకున్నారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సుడిగాలి సుధీర్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘హైలెస్సో’ . ఈ సినిమాలో శివాజీ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమాలో ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో శివాజీ ‘లైలం బాబు’ అనే ఒక పవర్‌ఫుల్, కాకరేపే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.
విడుదలైన బర్త్‌డే పోస్టర్‌లో శివాజీ లుక్ చాలా రగ్గడ్‌గా, వినూత్నంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని, మెడలో పులిగోరు ధరించి, చేతిలో గోలీసోడా బాటిల్ పట్టుకుని తీవ్రమైన ఆగ్రహంతో చూస్తున్న ఆయన పోజ్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో శివాజీ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. కాగా.. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివచెర్రీ, రవికిరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మైథలాజికల్ టచ్‌తో కూడిన పక్కా రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘హైలెస్సో’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ సినిమాను ఈ ఏడాది చివరలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






