విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

by Taduka Kalyani |

విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని ఏపీ డి ఓ, రమేష్ అన్నారు. మండల పరిధిలోని మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో మంగళవారం గిరిజన సంక్షేమ సహాయ అధికారి (ఏటీడీవో) పి.రమేష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
X

దిశ, ఏన్కూర్ : విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని ఏపీ డి ఓ, రమేష్ అన్నారు. మండల పరిధిలోని మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో మంగళవారం గిరిజన సంక్షేమ సహాయ అధికారి (ఏటీడీవో) పి.రమేష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించి,మెనూ అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల శుభ్రత,స్టోర్ రూమ్ లో నిత్యావసర సరుకుల నిల్వ, స్టాక్ రిజిస్టర్, పాఠశాల రికార్డులను పూర్తిగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి పీరియడ్ ప్లాన్, లెసన్ ప్లాన్, అకడమిక్ క్యాలెండర్ ను అమలు చేయాలని ఉపాధ్యాయులను సూచించారు. అలాగే పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నాగరాజు, డిప్యూటీ వార్డెన్ డిఎస్. నాగేశ్వరరావు ,ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story