- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వే నంబర్ 451 ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం కూల్చివేత
ప్రభుత్వ భూమి కబ్జా అనే శీర్షికతో ఆదివారం రోజున దిశ న్యూస్‌పేపర్‌లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ అధికారులు మంగళవారం రోజున ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 451లో అక్రమంగా నిర్మించిన బేస్‌మెంట్‌ను జేసీబీ ద్వారా కూల్చివేశారు.

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : ప్రభుత్వ భూమి కబ్జా అనే శీర్షికతో ఆదివారం రోజున దిశ న్యూస్‌పేపర్‌లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ అధికారులు మంగళవారం రోజున ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 451లో అక్రమంగా నిర్మించిన బేస్‌మెంట్‌ను జేసీబీ ద్వారా కూల్చివేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ కట్టడాలు చేపడితే రెవెన్యూ శాఖ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పసుమాముల గ్రామస్తులు దిశ న్యూస్‌పేపర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కఠినంగా చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. అదేవిధంగా, కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములపై ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్న దిశ న్యూస్‌పేపర్ యాజమాన్యానికి స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






