1.70 కోట్ల విలువ చేసే 414 కేజీల గంజాయి దహనం..

by Batti.Sumithra |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టుబడిన రూ.1.70 కోట్ల విలువ చేసే గంజాయిని దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు.

1.70 కోట్ల విలువ చేసే 414 కేజీల గంజాయి దహనం..
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టుబడిన రూ.1.70 కోట్ల విలువ చేసే గంజాయిని దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన 57 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296.31 కిలోల ఎండు గంజాయితో పాటు 964 గంజాయి మొక్కలను జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో, ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ, పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్‌సినరేషన్ ద్వారా దహనం చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.1.70 కోట్లు ఉంటుందని తెలిపారు. గత రెండేళ్లలో జిల్లాలో మొత్తం 414 కిలోల గంజాయి, 2,003 గంజాయి మొక్కలను నిర్మూలించినట్లు వెల్లడించారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, సీఐలు రవీందర్, బాలాజీ వరప్రసాద్, శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story