- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవుల దాడిలో చికిత్స పొందుతూ మహిళ మృతి..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని సంధ్యా తండాకు చెందిన బానోతు జాంకి (70) ఆవులు పొడవడంతో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.

X
దిశ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని సంధ్యా తండాకు చెందిన బానోతు జాంకి (70) ఆవులు పొడవడంతో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలంలో కట్టేసిన ఆవులను విప్పే సమయంలో రెండు ఆవులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఆమెపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. మృతురాలి కుమారుడు బానోతు మల్సూరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






