- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండ్లు కొనే నెపంతో వచ్చి 3 తులాల గోల్డ్ చైన్ చోరీ
by Batti.Sumithra |
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద దారుణం జరిగింది. దుద్దెడ గ్రామంలోని టోల్‌గేట్ వద్ద రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఎరుకల కనకవ్వ (50) అనే మహిళను టార్గెట్ చేసిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.

X
దిశ, కొండపాక : సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద దారుణం జరిగింది. దుద్దెడ గ్రామంలోని టోల్‌గేట్ వద్ద రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఎరుకల కనకవ్వ (50) అనే మహిళను టార్గెట్ చేసిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పండ్లు కొనుగోలు చేసేందుకు కస్టమర్లలా వచ్చిన గుర్తుతెలియని దుండగులు కనకవ్వను ఏమార్చి, ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు చైన్‌ను బలవంతంగా లాక్కొని క్షణాల్లో బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, టోల్‌గేట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






