IND VS ENG: భారీ వ‌ర్షం..తొలి టీ20 మ్యాచ్ ర‌ద్దు

by velandi.Saikiran |

భారీ వ‌ర్షం నేప‌థ్యంలో భార‌త్, ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగాల్సిన తొలి టీ20 మ్యాచ్ ర‌ద్దు అయింది.

IND VS ENG: భారీ వ‌ర్షం..తొలి టీ20 మ్యాచ్ ర‌ద్దు
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణమైంది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య బుధవారం తొలి టీ20 జరిగింది. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ ప్రారంభమైన‌ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇక ఇన్నింగ్స్ ముగిసే సమయానికి, వర్షం భారీగా పడింది.

అయినా వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో, మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు నిర్ణయం ప్రకటించేశారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 59, శ్రేయస్ అయ్యర్ 68 పరుగులు చేయగా.. సిక్సర్ల దూబే 42 పరుగులతో రాణించాడు. ఇక ఛేజింగ్ లో ఇంగ్లాండ్ ఒక్క బంతి ఫేస్ చేయకుండానే మ్యాచ్ రద్దయింది.. కాగా జూలై 4 న రెండో టీ20 జరగనుంది.

Next Story