యూజర్‌నేమ్ వివాదంపై స్పందించిన వాట్సాప్

by velandi.Saikiran |

యూజర్‌నేమ్ వివాదంపై స్పంయూజర్ నేమ్ ఫీచర్ పై వివరణ ఇవ్వాలని కేంద్ర సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసింది. దించింది వాట్సాప్.

యూజర్‌నేమ్ వివాదంపై స్పందించిన వాట్సాప్
X

దిశ, వెబ్ డెస్క్: యూజర్ నేమ్ ఫీచర్ తాజాగా తీసుకువచ్చింది వాట్సాప్. అయితే దీనిపై కేంద్ర సర్కార్ అభ్యంతరం తెలుపుతున్న సంగతి తెలిసిందే. యూజర్ నేమ్ ఫీచర్ పై వివరణ ఇవ్వాలని కేంద్ర సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఈ వివాదంపై వాట్సాప్ స్పందించింది. ఇంకా ఈ ఫీచర్ ను లాంచ్ చేయలేదని... ముందస్తుగా యూజర్ కు కావలసిన ఐడీని ఎంచుకునే ఆప్షన్ మాత్రమే కల్పించామని ఆ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీల పేర్లు దుర్వినియోగం కాకుండా రిజర్వ్ చేశామని వెల్లడించారు. యూజర్ నేమ్ ఫీచర్ వచ్చినప్పటికీ, వాట్సప్ వాడాలంటే ఫోన్ నెంబర్ తప్పనిసరి అంటూ తేల్చి చెప్పారు. యూజర్ భద్రతకు కచ్చితంగా హామీ ఇస్తామని తెలిపారు.

Next Story