హార్దిక్ పాండ్యా కోసం అర‌డ‌జ‌న్ జ‌ట్లు పోటీ !

by velandi.Saikiran |

హార్దిక్ పాండ్యా కోసం అర‌డ‌జ‌న్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయ‌ని స‌మాచారం.

హార్దిక్ పాండ్యా కోసం అర‌డ‌జ‌న్ జ‌ట్లు పోటీ !
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో కొత్త జట్టు తరఫున ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా బయటకు వచ్చాడని... మరో జట్టులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు. ఈ న్యూస్ బయటకు రాగానే మిగతా ఫ్రాంచైజీలు అలర్ట్ అయ్యాయి. హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా ముంబై ఇండియన్స్ నుంచి పాండ్యాను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐపీఎల్ 2026 జరుగుతుండగానే ముందుగానే హార్దిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ తర్వాత మిగిలిన జట్లు అన్ని పోటీ పడుతున్నాయి.

కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, RCB, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ట్రేడింగ్ ద్వారా పాండ్యాను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు షురూ చేశాయి. మ‌రి ఇందులో పాండ్యాను ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి. కాగా ముంబై యాజ‌మాన్యంతో పాండ్యాకు గొడ‌వ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది. అందుకే ముంబై నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాడ‌ట‌.

Next Story