- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఏకశిల’ అక్రమాలపై ఎందుకింత నిర్లక్ష్యం?
‘ఏకశిల అడ్వాన్స్ డ్ లెర్నింగ్ స్కూల్’ వ్యవహారంలో వి ద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం తీవ్ర వి మర్శలకు తావిస్తోంది.

దిశ, వనస్థలిపురం: కనీసం పర్మిషన్ లే కుండానే విద్యార్థుల అడ్మిషన్లు, ప్రచా రం కొనసాగిస్తున్న ‘ఏకశిల అడ్వాన్స్ డ్ లెర్నింగ్ స్కూల్’ వ్యవహారంలో వి ద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం తీవ్ర వి మర్శలకు తావిస్తోంది. పాత స్కూల్‌కు రంగులద్ది పర్మిషన్ లేని పేరుతో బోర్డులు పెట్టి.. రెండేళ్లుగా యథేచ్ఛగా విద్యాశాఖను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నా.. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. అక్రమార్కులతో విద్యాశాఖ అధికారుల కుమ్మక్కుతోనే ఇంత దర్జాగా తల్లిదండ్రులను బురిడీ కొడుతూ లక్షల్లో ఫీజులు గుంజుతూ చెలరేగిపోతున్నారని స్థానికులు మం డిపడుతున్నారు. వారం రోజుల కింద ట ఫిర్యాదులు అందిన వెంటనే బోర్డు లు తొలగించాలని డీఈవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అమలు చేయడంలో ఎంఈవో చేతివాటం మాయలో విఫలమయ్యారని తీవ్ర ఆ రోపణలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు, ఇదే విషయం డీఈవో దృష్టికి తీ సుకెళ్లినా.. ‘ఆదేశించాను.. అంతే’ అ న్నట్టుగా ఆయన కూడా స్పందించకుండా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
బరితెగిస్తున్న యాజమాన్యం
అధికారుల చేతివాటమో..? ఇంకేమై నా మాయనో తెలియదు.. గత రెండే ళ్లుగా ఇదే అవకాశంగా మలుచుకు న్న స్కూల్ యాజమాన్యం కాలనీల్లో కొత్త బోర్డులు ఏర్పాటు చేస్తూ ప్రచా రాన్ని మరింత విస్తరించినట్లు స్థానికు లు ఆరోపిస్తున్నారు. ఉన్న బోర్డులను తొలగించడం కాదు కదా.. ప్రియదర్శిని కాలనీ అంతటా యథేచ్ఛగా కొత్త బోర్డులు పాతుతుండడం విద్యాశాఖ అధికారులు సదరు యాజమాన్యానికి ఎంత దాసోహం అయిందో అర్థమవుతుంది. ‘ఎంఈవో ఇన్స్పెక్షన్ కోస మని స్కూల్‌కు వెళ్లడం.. మామూళ్లు ముట్టగానే స్కూల్ నుంచి సైలెంట్ గా జారుకోవడం’ ఇదే తంతు కొనసాగుతుందని పలువురు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలని..
విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పర్మిషన్ లేని స్కూల్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన డీఈవో, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ స్వయంగా జోక్యం చే సుకుని వాస్తవాలను వెలికి తీసి, నిబంధనలను కచ్చితంగా అమలు చేయా లని స్థానికులు, విద్యావేత్తలు డిమాం డ్ చేస్తున్నారు.
ఆదేశాలే.. అమలు ఎక్కడ?
‘ఏకశిల’ అక్రమాలపై డీఈవో ఆదేశా లు వెలువడి వారం రోజులు గడిచినా స్కూల్ బోర్డులు యథాతథంగా ఉండ డం, ప్రచారం మాత్రం మరింత జోరందుకోవడం అధికారుల పనితీరుపై ప్ర శ్నలు లేవనెత్తుతోంది. పర్మిషన్ లేని స్కూల్‌పై చర్యలు తీసుకోవాల్సిన ఎం ఈవో.. ఆఖరికి డీఈవో స్పందించి ఆ దేశాలిచ్చినా లెక్క చేయకుండా మౌ నంగా ఉండడం వెనుక కారణాలేమిటన్న చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో చర్యలు లేకపోవడంతో డీఈవో ఆదే శాలు కాగితాలకే పరిమితమయ్యాయ నే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్య వహారంలో డీఈవో కుమ్మక్కు వ్య వహారం ఉందేమోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






