మెరిసిన శ్రేయస్, అభిషేక్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంతే?

by velandi.Saikiran |

మొద‌టి టీ20 మ్యాచ్ లో శ్రేయస్, అభిషేక్ శ‌ర్మ మెరిసారు.

మెరిసిన శ్రేయస్, అభిషేక్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంతే?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20 సందర్భంగా భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన భారత్, 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 59 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో ఇరగదీశాడు. ఇద్దరు కూడా వికెట్ల ముందు దొరికిపోయి, వెనుదిరిగారు. అటు మిడిల్ ఆర్డర్ లో వచ్చిన సిక్సర్ల దూబే, 21 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు ఉన్నాయి. అందరూ అంచనా వేసినట్లుగానే 200 స్ట్రైక్ రేట్ తో దూబే పరుగులు సాధించాడు. ఇక ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు మరోసారి విఫలమయ్యాడు. అనవసర పరుగు కోసం వెళ్లి ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు సాధిస్తే, ఇంగ్లాండ్ విజయ కేతనం ఎగురవేయనుంది.

Next Story