- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యలో దొంగతనం ఎలా చేశారంటే.. ? చోరీ తీరును వివరించిన నిందితుడు
అయోధ్య రామాలయంలో సీసీ టీవీలకు, సెక్యూరిటీకి చిక్కకుండా చోరీ ఎలా చోశారో నిందితుడు దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు.
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలోని రామ్ మందిరంలో విరాళాల చోరీలో జరుగుతున్న దర్యాప్తు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దొంగిలించిన నగదు ఎవరికీ కనబడకుండా ఉండేందుకు, ఆలయ ప్రాంగణం నుండి బయటకు తరలించే ముందు తాత్కాలికంగా వాష్‌రూమ్‌లలో దాచినట్లు అరెస్ట్ అయిన నిందితులలో ఒకరైన అవినాష్ శుక్లా దర్యాప్తు అధికారులకు వెల్లడించారు. కోర్టు అనుమతితో అతడిని దాదాపు రెండు గంటల పాటు సిట్ విచారించింది. ఈ విచారణలో తాను రూ. కోట్లు దొంగిలించినట్లు అతడు అంగీకరించాడు. అలాగే చోరీ చేసిన తీరును కూడా వివరించాడు.
సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి..
విరాళాల లెక్కింపు ప్రక్రియ నుండి ఒకరు నగదు తీసే సమయంలో, మరి కొందరు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడేవారని అవినాష్ శుక్లా వెల్లడించాడు. ఆ తర్వాత ఆ డబ్బును వాష్‌రూమ్‌ల లోపల దాచి, అవకాశం దొరికినప్పుడు ఆలయ ప్రాంగణం నుండి బయటకు తరలించేవారని పేర్కొన్నాడు. ఆలయ ప్రాంగణంలో నిఘా కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం తమకు ముందే తెలుసని, అందువల్ల తాము పట్టుబడకుండా తప్పించుకోగలిగామని దర్యాప్తు అధికారులకు వివరించాడు. కాగా.. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా (ఇటీవలే రాజీనామా చేశారు), ఆలయానికి వచ్చే విరాళాలను లెక్కించే ప్రక్రియలో చాలా కీలకమైన పాత్ర పోషించేవారని తెలిపాడు. అయితే ఆయనకు, ట్రస్ట్ అధికారులకు తాము చాలా అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల తమపై పెద్దగా నిఘా, తనిఖీలు ఉండేవి కావని పేర్కొన్నాడు.
నిందితులను బీజేపీ రక్షిస్తోంది : కేజ్రీవాల్
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో బాధ్యులైన వారిని బీజేపీ కాపాడుతోందని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ ప్రసంగాలలో ఇప్పటి వరకు 42 సార్లు రామమందిరం పేరు ఎత్తారని, కానీ ఆలయ ప్రారంభోత్సవం జరిగినప్పటి నుండి ఆయన ఒక్కసారి కూడా ఆలయాన్ని సందర్శించలేదని విమర్శించారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే రాముడి పేరును వాడుకున్నారని ఆరోపించారు.






