హీరో నానికి గాయం..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్ !

by velandi.Saikiran |

హీరో నానికి గాయం అయిన‌ట్లు ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

హీరో నానికి గాయం..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కింది స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా నాని ఎదిగారు. అయితే అలాంటి నానికి గాయమైనట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. చేతికి కట్టుతో ఉన్న ఫోటోలను స్వయంగా నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయల్ హు.. ఇస్లీయే ఘాతక్ హు అంటూ దురంధర్ సినిమా డైలాగ్ క్యాప్షన్ కూడా పెట్టారు. గాయం గురించి మాత్రం నాని క్లారిటీ ఇవ్వలేదు. అయితే కెమెరా ఎమోజీ పెట్టడంతో... అతడికి షూటింగ్ సమయంలో గాయమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇది ఇలా ఉండగా నాని లేటెస్ట్ గా నటించిన సినిమా ప్యారడైజ్. ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. మొన్న పెద్ది సమయంలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా... షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతోంది.

Next Story