- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ కొత్త సినిమా..కియారాకు మరోసారి ఛాన్స్?
రామ్ చరణ్ కొత్త సినిమాలో కియారాకు మరోసారి ఛాన్స్ దక్కనుందట.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఇటీవల పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్ చరణ్... తన తర్వాతి సినిమాను సుకుమార్ తో చేయబోతున్నారు. RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన మరోసారి కియారా అద్వానీకి ఛాన్స్ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు ఇప్పటికే కియారా అద్వానీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో మెరిశారు కియారా. ఈ సినిమాలు రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
అయినప్పటికీ దర్శకుడు సుకుమార్...కియారా అద్వానీనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా ఈ కొత్త సినిమా స్టోరీ, టెక్నికల్ టీం ఎంపిక లాంటి అంశాలపై దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఫోకస్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ది సినిమా చేశారు. ఈ సినిమా దాదాపు నెలరోజులుగా థియేటర్లలో నడుస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్ కూడా వచ్చాయి.






