- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేని అంత్యక్రియలకు ఖర్గే, నితిన్ నబిన్‌కు ఇరాన్ ఆహ్వానం
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కు ఆహ్వానం అందింది.

Ayatollah Khamenei Net Worth
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు ఆ దేశం ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నాయకులైన సల్మాన్ ఖుర్షీద్, పవన్ ఖేరా కూడా పిలుపు అందినట్టు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న మరణించిన ఖమేని అంత్యక్రియలు వచ్చే వారం అధికారిక లాంఛనాలతో జరపనున్నారు. దీనికి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నుండి అధికారిక ఆహ్వానం అందింది. అయితే దీనికి నేరుగా మోడీ హాజరు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించడానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, షియా సమాజానికి చెందిన బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ హాజరవుతున్నారు.






