సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు రిమాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-30 17:25:20  IST  )

విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ (SIT) కీలక నిర్ణయం తీసుకుంది.

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) జెట్ స్పీడ్‌తో దర్యాప్తు చేపడుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణను ముమ్మరం చేసిన సిట్ అధికారులు, ఈ కేసులో మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చారు. ఇందులో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను నిందితులుగా గుర్తిస్తూ విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. వీరిద్దరిని కేసులో వరుసగా A5, A6 నిందితులుగా చేర్చినట్లుగా సమాచారం.

అయితే, సాయికృష్ణ మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యల్లో భాగంగా సిట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతోంది. తాజా నియామకాలతో ఈ కస్టోడియల్ డెత్ కేసులో మొత్తం నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. లాకప్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆపై మరణించడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం, వేధింపులు ఉన్నాయనే కోణంలో సిట్ ఆధారాలను సేకరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోగా, తాజా పరిణామం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story