వైభవ్‌కు మళ్లీ షాక్‌? శ్రేయస్ అయ్య‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న

by velandi.Saikiran |

వైభవ్ అరంగేట్రంపై శ్రేయస్ అయ్య‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

వైభవ్‌కు మళ్లీ షాక్‌? శ్రేయస్ అయ్య‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐర్లాండ్ చేతిలో ఓడిన భారత జట్టు, బలమైన ఇంగ్లాండ్ తో తలపడేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ తో జరిగే టీ20లో వైభవ్ ఆడడంపై క్లారిటీ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో రాణించిన వారికి మద్దతుగా నిలవాలని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి స్పష్టం చేశారు.

ప్రతి ఆటగాడికి భద్రత కల్పించి.. అవకాశాలు ఇవ్వాలని వెల్లడించారు. అప్పుడే కాన్ఫిడెన్స్ తో తదుపరి మ్యాచ్ లలో ఆడతారన్నారు. టీ20 వరల్డ్ కప్ అందించిన వారికి ఈ ఫార్మాట్ గురించి బాగా తెలుసు అన్నారు. అందుకే వారికి అండగా నిలబడాలని స్పష్టం చేశారు శ్రేయస్ అయ్యర్. ఇక కెప్టెన్ శ్రేయస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ లో కూడా వైభవ్ కు అవకాశాలు రావడం కష్టమే అని అంటున్నారు.

Next Story