- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్ జట్టు నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్ జట్టు నిలిచింది. మంగళవారం మంగళగిరి స్టేడియం వేదికగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరిగింది. ఇందులో సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన భీమవరం బుల్స్... ప్రత్యర్థి సింహాద్రి వైజాగ్ లయన్స్ పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వైజాగ్, 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది.
ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 9 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది భీమవరం బుల్స్. దీంతో ఫైనల్స్ లో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ హేమంత్ రెడ్డి 18 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ రేవంత్, 19 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఫైనల్స్ ఏకపక్షంగా జరిగింది. ఫైనల్స్ లో విజయం సాధించిన భీమవరం జట్టుపై మంత్రి నారా లోకేష్ ప్రశంశల వర్షం కురిపించారు.
🏟️❤️ WHAT. A. NIGHT.
— Andhra Premier League (@AndhraT20League) June 30, 2026
A FULL HOUSE for the APL 2026 Final! 🙌🏆
Thank you, Mangalagiri! 💙
Your energy, your passion, and your unwavering support made this a night to remember forever. 🔥
You didn't just witness the final—you became a part of APL history.#APL2026 #APLFinal pic.twitter.com/qmXb6py7gC






