- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చి మూడేళ్లయింది, నమ్మండి.. ఈసారి కొడుతున్నాం
లెనిన్ సినిమా ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తాను నటించిన సినిమా వచ్చి మూడేళ్లు అయిందని, అందుకు అభిమానులు అందరూ క్షమించాలంటూ అక్కినేని అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మాత్రం లెనిన్ సినిమాతో హిట్ కొట్టబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. మురళి కిషోర్ అబ్బూరి, హీరో అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్ గా మెరువనుండగా.. నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూలై 10వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా.. మంగళవారం విశాఖ వేదికగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో అఖిల్ అక్కినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తాను ఎక్కువగా మాట్లాడకూడదని.. రిలీజ్ రోజు తన సినిమానే మాట్లాడుతుందని అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. తాను నిద్రపోయి రెండు రోజులైందని.. అయినా కూడా మిమ్మల్ని చూసేందుకు, ఎనర్జీ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా మరో ఎత్తు అన్నారు. ఈసారి కచ్చితంగా హిట్ కొడుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు అఖిల్.






