సమంతకు జీవితాంతం ఆ స‌మ‌స్య‌లు..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?

by velandi.Saikiran |

సమంతకు జీవితాంతం ఆనారోగ్య‌ స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ గా మారింది.

సమంతకు జీవితాంతం ఆ స‌మ‌స్య‌లు..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత... ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ప్రతి సినిమా హిట్ అందుకొని, దాదాపు 17 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే అలాంటి హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడ్డ నేపథ్యంలో మళ్లీ మయో సైటిస్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సమంత ఆరోగ్య పరిస్థితిపై దర్శకురాలు నందిని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మయో సైటిస్ వ్యాధి వల్ల సమంత రెండేళ్లుగా ఉప్పు, రుచి లేని కఠినమైన డైట్ ఫాలో అవుతున్నట్లు వివరించారు. ఈ ఆటో ఇమ్యున్ కండిషన్ కు నివారణ లేదన్నారు. వ్యాధి తీవ్రత పెరగకుండా నిత్యం ఆహార నియమాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో జీవితాంతం సమంత ఈ అనారోగ్యంతో బాధపడాల్సిందేనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story